సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు గజ్వేల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి హరీశ్ రావు రేపు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గజ్వేల్లో పరిపాలనా సౌలభ్యం కోసం రూ.7.80 కోట్లతో నూతన మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని మంత్రి రేపు ప్రారంభించనున్నారు.
మైనారిటీల సౌకర్యార్థం రూ.3.14 కోట్లతో షాదీఖానా భవనం, ఎక్సైజ్ కార్యాలయం కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని హరీశ్ ప్రారంభించనున్నారు. వీటితో పాటు గజ్వేల్లో ఆర్అండ్బీ అతిథి గృహా నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి: srinivas goud: 'సీఎంపై ఈటల వ్యాఖ్యలు చేయడం సరికాదు'