ETV Bharat / state

సిద్దిపేటలో అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు - సిద్దిపేట జిల్లా లేటెస్ట్​ వార్తలు

సిద్దిపేట సిగలో మరో కలికితురాయి చేరింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే మరో ప్రకృతి రమణీయ ప్రదేశం సిద్ధమైంది. కళ తప్పిన అడవిని కాపాడి.. పునర్‌వైభవం తెచ్చిన ప్రభుత్వం.. క్రమంగా ఆక్సిజన్ పార్కుగా అభివృద్ధి చేసింది. ఇవాళ ఈ పార్కును ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించనున్నారు.

Finance Minister Harish Rao will inaugurate the Urban Park in Siddipet today
సిద్దిపేటలో అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు
author img

By

Published : Jan 28, 2021, 3:57 AM IST

Updated : Jan 28, 2021, 6:33 AM IST

సిద్దిపేటలో అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

సగటు మనిషి లేచినప్పటి నుంచి పడుకునే వరకు పని ఒత్తిళ్లతో సతమతం అవుతున్నాడు. వీటిని అధిగమించేందుకు కాలంతో పోటీపడి మరి పరిగెత్తాల్సిందే. అవకాశం దొరికినప్పడు వీటన్నింటికీ దూరంగా.. ప్రకృతికి దగ్గరగా వెళ్లి.. ప్రశాంతత పోందాలంటే సగటు పట్టణ జీవికి పగటి కలే. ఇందుకోసం ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లాలి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పట్టణాలకు సమీపంలో అర్బన్‌ పార్కుల పేరుతో ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేటలో వందల ఎకరాల విస్తీర్ణంలో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

మూడేళ్లలో హరిత వనంగా మార్చారు

ఆక్సిజన్ పార్కు ఏర్పాటుపై ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేటకు అతి సమీపంలో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 2017 వరకు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతాన్ని మూడేళ్లలో హరిత వనంగా మార్చారు. మొదట పార్కు చుట్టూ కంచె వేయించారు. అనంతరం లక్షకు పైగా మొక్కలు నాటించారు. కుంటలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి జలవనరులను అభివృద్ధి చేశారు. ఫలితంగా పచ్చదనం, జంతుజాలం పెరిగింది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, నక్కలు, అడవి పందులు వంటి జంతువులు, నెమళ్లు వంటి పక్షుల సంతతి పెరిగింది.

ఎన్నో ప్రత్యేకతలు

ప్రజల ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా అనేక ప్రత్యేకతలతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. చిన్నారుల కోసం ఉయ్యాల, జారుడు బండ వంటి వాటితో ఆటస్థలం, పెద్దల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రకృతి గురించి పాఠాలు నేర్చుకునేందుకు ప్రకృతి పాఠశాల, చిక్కని చిట్టడవిని తలపించే మియావాకీ ప్రకృతి వనం రూపొందించారు. 12 రాశులకు ప్రత్యేకమైన చెట్లతో రాశి వనం, అడవి అందాలు చూసేందుకు వాచ్ టవర్లు, 9 కిలోమీటర్ల నడక దారి, 11 కిలోమీటర్ల సైక్లింగ్ దారి, విశ్రాంతి తీసుకునేందుకు హట్లు.. ఇలా ఈ పార్కు ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోవాల్సిందే. ఈ వనంలోకి వచ్చిన సందర్శకులు... తిరిగి వెళ్లాలనిపించట్లేదని అంటున్నారు. మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పార్కుకు తేజో వనం అర్బన్ ఫారెస్ట్ పార్కుగా నామకరణం చేశారు. ఇవాళ మంత్రి హరీశ్‌రావు ఈ పార్కును ప్రారంభిస్తారు.

ఇదీ చదవండి: అఖిల భారత ఉద్యాన వన ప్రదర్శన

Last Updated : Jan 28, 2021, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.