రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన భాజపా నేతలు పోలీసులపైనా తిరిగి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దొరికిన డబ్బు రఘునందన్‌రావుకు చెందినదని ఇంటి యజమాని తెలిపాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయ పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. సోదాల సమయంలో తీసిన వీడియోలు ఉన్నాయని... వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. భాజపా నేతల ఇళ్లలో డబ్బులు దొరకడంతోనే వారు గందరగోళం చేస్తున్నారన్నారు. తెరాసకు చెందిన ఇద్దరు నేతలు, భాజపా నేత ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారని తెలిపారు.
గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన భాజపా ఈ ఎన్నికల్లోను అదే పునరావృతం అవుతుందనే విషయం వారికి అర్థమయిందన్నారు. భాజపా అభ్యర్థిపై ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదని విమర్శించారు. ప్రజలే భాజపా నేతలకు బుద్ధి చెబుతారని... నూటికి నూరుశాతం దుబ్బాకలో తెరాస విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా నేతలు రెచ్చగొట్టినా తెరాస కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ