ETV Bharat / state

కేసీఆర్​తో దుబ్బాక ప్రజలకు నీటి కష్టాలు దూరం: హరీశ్ - దుబ్బాకలో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ

కేసీఆర్​ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనే దుబ్బాక ప్రజలకు నీళ్ల కష్టాలు తప్పాయని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎంపీ ప్రభాకర్​ రెడ్డితో కలిసి పర్యటించిన మంత్రి... మహిళ స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు.

harish rao distribute cheques for women self help groups in dubbaka
కేసీఆర్​తో దుబ్బాక ప్రజలకు నీటి కష్టాలు దూరం: హరీశ్
author img

By

Published : Sep 21, 2020, 8:47 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు పర్యటించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో... 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 546 మహిళ సంఘాలకు 17కోట్ల 58లక్షల 8వేల రూపాయల చెక్కులు అందించినట్టు మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్​ బాధ్యతలు చేపట్టాకే... దుబ్బాక ప్రజల నీటి గోస తీరిందని హరీశ్​ వ్యాఖ్యానించారు. మైళ్ల కొద్ది వెళ్లి మహిళలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మారిందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డితో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీవో గోపాల్​రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భారీ వర్షాలున్నాయ్... అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.