సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో ఉపాధిహామీ పనిక్షేత్ర సహాయకులు నిరవధిక సమ్మెకు దిగారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర క్షేత్ర సహాయకుల సంఘం పిలుపు మేరకు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాన్ని పెంచాలని కోరుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్