దుబ్బాక ఉపఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధించడమే లక్ష్యమని ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశానికి వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మాగాంధీ కన్న కలలను నెరవేర్చే దిశగా తెరాస ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని వంటేరు పేర్కొన్నారు.
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న నినాదంతో.. అన్ని విధాలా అభివృద్ధి పనులు జరుపుతున్న సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు ఏదైనా చిన్న విషయం దొరికితే కోతికి పుండు పుట్టినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో... దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో తెరాస జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.