సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు ఫారెస్ట్ కళాశాల వద్ద ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మనిషి మనుగడకు మొక్కలు ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా గ్రామాల్లో కోతుల బెడద ఉండకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో, రోడ్ల పక్కన మొక్కలు నాటాలని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడంతో పాటు... రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.