ETV Bharat / state

ఆవేదన జ్వాలలు రగిలి... పండించిన పంట ఆహుతి - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో నియంత్రిత పంటల మంటలు ఆగడం లేదు. సన్న రకాలు అగ్నికి ఆహుతి అవడం తప్పడం లేదు. ఒక వైపు అధిక వర్షాలు... మరోవైపు దోమ పోటు పంటను పీల్చి పిప్పి చేయగా ఉన్న కాస్త పంటకి మద్దకు ధర కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన జ్వాలలు రగిలి... చివరకు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నిప్పుల పాలు చేశాడు ఓ అన్నదాత.

farmer-set-fire-to-the-crop-at-dubbaka-mandal-in-siddipet-district
ఆవేదన జ్వాలలు రగిలి... ఆరుగాలం శ్రమించిన పంటకు నిప్పు
author img

By

Published : Nov 8, 2020, 5:48 PM IST

ఓవైపు అధిక వర్షాలు... మరోవైపు దోమపోటు పంటని పీల్చి పిప్పిచేయగా మిగిలిన పంటకు మద్దతు ధర కల్పించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సన్నరకం ధాన్యం వేసి అధిక పెట్టుబడులు పెడితే చివరకు నష్టాలే మిగిలాయని వాపోయారు. చేసేది లేక మనస్తాపంతో ఆరుగాలం శ్రమించిన పంటకు నిప్పు పెట్టాడు ఓ రైతు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లిలో పంటకు నిప్పు పెట్టి... అవే మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.

దిగుబడి రాలేదని...

పెడ్డగుండవెళ్లి గ్రామానికి చెందిన నక్కల బాపురెడ్డి అనే రైతు తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు ఎకరాల సన్న రకం వడ్లను సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మనస్తాపంతో తన పొలాన్ని తగలబెట్టాడు. అదే మంటల్లో దూకి ఆత్మహత్య యత్నానికి సిద్ధపడగా... తోటి రైతులు, కుటుంబసభ్యులు బాపురెడ్డిని అడ్డుకుని ఓదార్చారు.

"దొడ్డు రకం వేసినప్పుడు కొద్దో గొప్పో లాభాలు వచ్చేవి. సన్నారకాలతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన నష్ట పరిహారం చెల్లించాలి. లేదంటే ఆత్మహత్యే మాకు శరణ్యం."

- పెద్దగుండవెళ్లి గ్రామ రైతులు

ఇదీ చదవండి: ఈటీవీ భారత్​ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.