ETV Bharat / state

సకల సౌకర్యాలతో త్యాగధనుల కాలనీ.. ఈ వారంలోనే గృహప్రవేశాలు! - colony for mallanna sagar Expatriates at siddipet

విశాలమైన రహదారులు.. అత్యాధునిక సౌకర్యాలు.. ఆహ్లాదం పంచే పార్కులు.. విద్యా, వైద్య సదుపాయాలకు స్థలాలు. బారులు తీరిన వేలాది ఇళ్లు.. సకల సౌకర్యాలతో సిద్దిపేట జిల్లాలో రూపుదిద్దుకుంటున్న పునరావాస కాలనీ.. దేశంలోనే అతి పెద్దదిగా నిలుస్తోంది. ఆధునిక హంగులతో ఈ రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఈ వారంలోనే నిర్వాసితులతో సామూహిక గృహప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది.

houses for mallanna sagar
సకల సౌకర్యాలతో త్యాగధనుల కాలనీ
author img

By

Published : Apr 5, 2021, 5:42 AM IST

సకల సౌకర్యాలతో త్యాగధనుల కాలనీ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులోనే అతిపెద్ద జలాశయమైన ఈ రిజర్వాయర్‌ కోసం 19 వేల 595 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీంతో జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామాలు పూర్తిగా.. 3 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. నిర్వాసితుల త్యాగానికి తగిన గౌరవం ఇచ్చేలా వారికి దేశంలోనే అత్యుత్తమ పునరావాస కాలనీ నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో నిర్ణయించారు.

అత్యాధునిక వసతులతో..

సీఎం ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్ సమీపంలో అత్యాధునిక వసతులతో కాలనీ నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన నిపుణులతో కాలనీకి డిజైన్లు తయారు చేయించారు. 600 ఎకరాల్లో 3 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2,300పైగా ఇళ్ల నిర్మాణం పూర్తైంది. ఒక్కోదాన్ని 250 గజాల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇంటిని నిర్మిస్తున్నారు. మల్లన్న సాగర్‌లో ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి ఏడున్నర లక్షల రూపాయల పరిహారంతో పాటు ఇక్కడ ఇళ్లు అందిస్తున్నారు. వీరిలో 18 సంవత్సరాల వయసు దాటిన అవివాహితులకు సైతం పరిహారం అందిస్తున్నారు. 5 లక్షల రూపాయలతో పాటు.. 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు.

రూ. 230 కోట్ల వ్యయం..

230 కోట్ల రూపాయలతో నిర్వాసిత కాలనీని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మిస్తున్నారు. 80 అడుగుల వెడల్పుతో ప్రధాన రోడ్లు, 60-40 అడుగుల వెడల్పుతో అంతర్గత రోడ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఫంక్షన్ హాల్, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, ఆసుపత్రి వంటి వాటితో పాటు మురుగు నీటి శుద్ధి ప్లాంట్, వైఫై వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు.

నాణ్యతపై హర్షం..

మల్లన్న సాగర్ నిర్మాణం దాదాపు పూర్తైనందున.. ఇప్పటికే కొంత నీటిని విడుదల చేశారు. మిగిలిన పనులు పూర్తి చేసి.... జూన్ నాటికి దశలవారీగా పూర్తి స్థాయిలో నీటిని నింపనున్నారు. దీంతో ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఉగాది నాటికి పునరావాస కాలనీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా నిర్మిస్తున్న ఈ పునరావాస కాలనీలో మిగిలిపోయిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. వందలాది మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులను 11 బృందాలుగా చేసి పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు.. కాలనీలోనే ఉండి తమకు అప్పగించిన పనులు వేగంగా చేయిస్తున్నారు. అన్నీ పనులు పూర్తైన ఇళ్లలోకి లబ్ధిదారులు వస్తున్నారు. ఇప్పటికే 400పైగా కుటుంబాలు ఇక్కడికి మకాం మార్చారు. పునరావాస కాలనీలో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, నిర్మాణ నాణ్యతను చూసి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: ఇదే.. మల్లన్నసాగర్‌ త్యాగధనుల కాలనీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.