సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఆరేపల్లిలో పది రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులు, వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగి నేలకూలాయి. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాజయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా విరిగిపడింది. రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులకు మొర పెట్టుకున్నా.. స్పందించి మరమ్మతులు చేపట్టలేదు. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, హుస్నాబాద్ మండల వైస్ ఎంపీపీ గడిపె మల్లేష్ రైతు పొలం దగ్గరికి వెళ్లి పరిశీలించారు. రైతుల సమస్యల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే.. ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు వెంటనే మరమ్మతులు చేసి.. విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'