ETV Bharat / state

దుబ్బాక మున్సిపాలిటీ తొలి బడ్జెట్ సమావేశం - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక మున్సిపల్​ కార్యాలయంలో మున్సిపాలిటీ తొలిబడ్జెట్​ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీలో గల వివిధ సమస్యల గురించి చర్చించారు.

dubbaka muncipality first budget meeting dubbaka muncipal office
దుబ్బాక మున్సిపాలిటీ తొలి బడ్జెట్ సమావేశం
author img

By

Published : May 18, 2020, 5:34 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ తొలి బడ్జెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. తొలి బడ్జెట్ సమావేశంలో మున్సిపాలిటీలో గల వివిధ సమస్యల గురించి కౌన్సిలర్లతో చర్చించారు. కౌన్సిలర్లు తమతమ వార్డులలో గల సమస్యలను వివరించారు.

బడ్జెట్ కేటాయింపులు, అంచనా, రాబడి, వ్యయాలకు సంబంధించి బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్​ను అనుసరించి మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. తొలి బడ్జెట్ సమావేశానికి అడిషనల్ కలెక్టర్,ఎమ్మెల్యేతో పాటు, మున్సిపల్ ఛైర్​పర్సన్ వనిత, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు.

ఇవీ చూడండి: 'కొవిడ్​ పేరుతో దేశ సంపదను దోచిపెడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.