సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 52 మంది రేషన్ డీలర్లకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కమిషన్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కరోనా విపత్తు సమయంలో రేషన్ డీలర్లు ప్రాణాలకు తెగించి లబ్ధిదారులకు రేషన్ బియ్యం, పప్పు దినుసులు అందించారని ఎమ్మెల్యే కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పుష్పలత, మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత పాల్గొన్నారు.