కరీంనగర్‌లోని ఓ క్వారీలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు గత రాత్రి ఇన్నోవా వాహనంలో సిద్దిపేట జిల్లా బద్దిపడగకు పయనమయ్యారు. మల్లారం స్టేజ్ నుంచి బద్దిపడగకు వెళ్తున్న సమయంలో.. సికింద్లాపూర్, బద్దిపడగ గ్రామాల మధ్య క్రాస్‌వే రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కారు చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఈదుకుంటూ వెళ్లి వాగు మధ్యలో ఒక చెట్టును ఆధారం చేసుకుని అక్కడే ఆగారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్ మాత్రం కారుతో పాటు కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న రాజగోపాలపేట ఎస్ఐ యువత, సిబ్బంది సాయంతో అర్ధరాత్రి డ్రాగన్లైట్ వెలుగులో ముగ్గురు వ్యక్తులు రామచంద్రపురానికి చెందిన బొద్దు శ్రీధర్, అనంతగిరికి చెందిన సురేశ్, బద్దిపడగకు చెందిన శ్రీనివాస్‌ను కాపాడారు.
విషయం తెలుసుకున్న కమిషనర్ ఈరోజు ఉదయం సంఘటనాస్థలికి చేరుకున్నారు. కారుతో సహా గల్లంతైన డ్రైవర్ కోసం సీపీ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి గాలిస్తున్నా.. ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి:- వరదలో చిక్కుకున్న యువకుడు.. హెలికాఫ్టర్‌తో సాయం