సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట శివారులో సర్కారు అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన లేఅవుట్లపై అధికారులు కొరడా ఝలిపించారు. సర్వేనెంబర్ 222/c1, c2,c3 సర్వే నెంబర్లలోని సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ప్లాట్లుగా విభజించి ఏర్పాటుచేసిన హద్దు రాళ్లను అధికారులు తొలగించారు. బెజ్జంకి మండలం ఎంపీడీవో ఓబులేష్, ఈఓపిఆర్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కార్యదర్శి శ్రీనివాస్ సిబ్బంది ఆధ్వర్యంలో హద్దు రాళ్లను ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. గ్రామ గ్రామాన భూములను పరిశీలిస్తు అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'భజరంగ్‌దళ్ కార్యకర్తలకు సీపీ వేధింపులు'