సిద్దిపేట మెుదటి శాసనసభ్యుడు ఎడ్ల గురువారెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎడ్ల గురువారెడ్డి నిబద్ధత గల రాజకీయ వేత్తని వెంకట్రెడ్డి కొనియాడారు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమై భ్రష్టు పట్టినాయన్నారు. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొని కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసి సంతోషపడుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని కోరారు. గోదావరి జలాల వినియోగం కోసం సీపీఐ ఏళ్ల తరబడి పోరాటం చేసిందన్నారు. ఈ నెల19, 20న సీపీఐ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తుందని చాడ వెంకట్రెడ్డి వెల్లడించారు.
గురువారెడ్డి చిత్రపటానికి చాడ వెంకట్రెడ్డి నివాళులు - guruvareddy
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సిద్దిపేట మొదటి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాళులర్పించారు.