కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ వివరాలను మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో అధికారులతో సమావేశమైన హరీశ్... ప్రణాళిక ఖరారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని చివరి లిఫ్టింగ్ కొండపోచమ్మ రిజర్వాయర్‌తో... ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోందని మంత్రి అన్నారు. 618 మీటర్ల ఎత్తున్న ప్రాజెక్టు ప్రారంభం... చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కరోనా వల్ల ముఖ్యమైన వారినే ఆహ్వానించి కార్యక్రమం సాదాసీదాగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
సీఎం పర్యటన షెడ్యూల్..
- తెల్లవారుజామున 4 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో చండీహోమం
- మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహణ
- ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయం వద్ద చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు
- ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లి రైతు వేదికకు శంకుస్థాపన
- ఉదయం 9.40 గంటలకు మర్కూక్ రైతు వేదికకు శంకుస్థాపన
- ఉదయం 9.50 గంటలకు మర్కూక్ పంప్‌హౌస్ వద్దకు సీఎం కేసీఆర్
- ఉదయం 10 గంటలకు సుదర్శన యాగంలో పాల్గొననున్న సీఎం దంపతులు, చినజీయర్ స్వామి
- ఉదయం 11.30 గంటలకు మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, చినజీయర్‌స్వామి
- ఉదయం 11.35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి
- మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్ మండలం వరదరాజస్వామి ఆలయంలో సీఎం పూజలు
- మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం
ఇదీ చూడండి: మిడతలదండు అంశంపై ముగిసిన సీఎం సమీక్ష