కోటి వృక్షార్చనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటారు. సీఎం జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు.
ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్క నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్ను సీఎం అభినందించారు.
ఇదీ చదవండి: కేసీఆర్కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'