ETV Bharat / state

బడ్జెట్ పట్ల హర్షం.. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

కేంద్ర బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో భాజపా నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ప్రశంసించారు.

author img

By

Published : Feb 1, 2020, 11:24 PM IST

Budget is a hoax at karimnagar bjp leader modi photos milk at siddipet
బడ్జెట్ పట్ల హర్షం.. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పలువురు భాజపా నాయకులు 2020-21 కేంద్ర బడ్జెట్​కు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని అన్నారు.

ఈ బడ్జెట్‌ లక్ష్యం ప్రజల ఆదాయం పెంచడమేనని పలువురు భాజపా నాయకులు అన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు, విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు, ఆదాయపన్ను 5 లక్షల వరకు మినహాయింపు ఇస్తూ, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 20% పన్ను ఉండగా, 10%కి తగ్గించారన్నారు. బ్యాంకు డిపాజిట్ బీమాను లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పెంచారన్నారు. ఈ బడ్జెట్ పూర్తి స్థాయి దేశ అభివృద్ధికి దోహదపడేలా పద్దులు కేటాయించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.