తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన చూసిన అనేక దృశ్యాలను కెమెరాల్లో బంధించి... ఆ ఫొటోలు ట్విట్టర్లో పంచుకున్నారు.
రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు ట్రీ టన్నెల్ మాదిరి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. పల్లె ప్రకృతి అందాలు, వ్యవసాయ పనిముట్ల చిత్రాలను.. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు ట్విట్టర్లో టాగ్ చేశారు.
ఇదీ చూడండి : కోటిన్నర మొక్కలు నాటే ఛాలెంజ్‌కు మహేశ్ బాబు మద్దతు