భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాజపా నాయకులను పరామర్శించారు.
బల్వంతపూర్లో భాజపా నేత చిట్యాల గోపాల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, అతణ్ని పరామర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మాజీపేటలో భాజపా నాయకులను, వారి కుటుంబాలను కలిసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.