తెలంగాణ ప్రభుత్వం కరోనాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, వందలాది తెరాస కార్యకర్తలు పాల్గొనడం వల్ల చిట్టాపూర్ గ్రామం కరోనా బారిన పడిందని ఆరోపించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు.
గణేశ్ చతుర్థి వేడుకలు జరుపుకోవడానికి అనుమతించకుండా కేసీఆర్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్వీయ నియంత్రణ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ మండపాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు వినాయక చవితిని జరుపుకోవాలని తెలిపారు.
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొగుళ్ల మల్లేశాన్ని రాష్ట్ర భాజపా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు ప్రకాశ్, కొండల్, సాయి, గోపి, స్వామి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : అన్నీతానైన తల్లి.. అనాథగా మిగిలింది...