సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ప్రచారం చేశారు. దుబ్బాకలో భాజపా గెలుపు ఖాయమన్నారు. సిద్దిపేట సీపీని చూసి.. చనిపోయిన పోలీసు అమరవీరులు సిగ్గుపడుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి ఏబీవీపీ సభ్యుడని గుర్తు చేశారు. కేసీఆర్ కరెంట్ బిల్లు బకాయి కింద రూ. 2000 వేల కోట్లు కట్టాలని.. ఆ బకాయిలను ప్రధాని మోదీ కట్టారని చెప్పారు.
కేసీఆర్ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని... మీటర్లు పెడితే తాము అడ్డుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలన్నారు. ఇంటర్ విద్యార్థులు చనిపోయినా కేసీఆర్ బయటికి వచ్చి కనీసం సంతాపం ప్రకటించ లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు చనిపోతే సీఎం బయటికి రాలేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో నిరూపిస్తానని.. దుబ్బాక చౌరస్తాకు చర్చకు రావాలని కేసీఆర్ సవాలు విసిరితే స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్