దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే అధికారంలో ఉన్న తెరాస, మంత్రి హరీష్ రావు పోలీసులు పంపించి సిద్దిపేటలో రఘునందన్ రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేయడం దారుణమని మెదక్ భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ... మెదక్ పట్టణం కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు జరపడం విడ్డూరమని పేర్కొన్నారు. రఘునందన్ రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తారు కానీ... తెరాస వారి వాహనాలు.. వారి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు.
దుబ్బాకలో పోలీస్ రాజ్యం నడుస్తోందని పోలీసులను ఏజెంట్‌గా పెట్టుకొని రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలు జరగాలని భాజపా తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: నగదు దొరికినా నాటకాలేంటి: హరీశ్‌రావు