ETV Bharat / state

'కరోనా సమయంలో విద్యుత్ బిల్లుల పెంపు సరికాదు' - Current Charges Increase Telangana

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక ఏడీఈ కార్యాలయం ఎదుట భాజపా నేతలు బైఠాయించారు.

BJP Protest at Dubbaka
దుబ్బాకలో భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 4:52 PM IST

విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక ఏడీఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి ప్రజలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వేళ... తెలంగాణ ప్రభుత్వం విద్యుత్​ బిల్లులు పెంచి వారిని దోచుకుంటోందని భాజపా నేతలు ఆరోపించారు.

ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు పెంచి 3 నెలలకు వడ్డీ వసూలు చేయడం సమంజసం కాదన్నారు. 3 మాసాల బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు రాజిరెడ్డి, కొండల్​ రెడ్డి, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: లక్ష్మణ్‌ అరెస్ట్‌.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.