వరంగల్‌లో ఆదివారం నిజమాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అర్వింద్‌పై తెరాస కార్యకర్తలే దాడి చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోగా పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఎంపీ అర్వింద్‌పై స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, తెరాస కార్యకర్తలే దాడి చేశారని భాజపా నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.