ETV Bharat / state

తెరాస అభివృద్ధిని ఆదరించి ఆశీర్వదించండి: హరీశ్​

తెరాస చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఆదరించి.. ఆశీర్వదించండని ప్రజలను మంత్రి హరీశ్ రావు కోరారు. ప్రజల సంక్షేమం కోసం భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్క మంచి పనైనా చేశాయా అని ప్రశ్నించారు. ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించాయా అని నిలదీశారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండల భాజపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాస్తి శ్రీనివాస్..​ మంత్రి హరీశ్​ రావు సమక్షంలో తెరాస గూటికి చేరారు.

తెరాస అభివృద్ధిని ఆదరించి ఆశీర్వదిద్దాం: మంత్రి హరీశ్​

author img

By

Published : Oct 6, 2020, 5:18 PM IST

సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండల భాజపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాస్తి శ్రీనివాస్..​ హరీశ్ రావు సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ముబారస్ ​పూర్​ గ్రామ వార్డు మెంబర్స్, పలువురు భాజపా నాయకులు​ తెరాసలో చేరారు. దుబ్బాక తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపిద్దామని మంత్రి కోరారు.

తెరాస చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఆదరించి.. ఆశీర్వదించాలని ప్రజలను మంత్రి హరీశ్ రావు కోరారు. ప్రజా సంక్షేమం కోసం భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్క మంచి పనైనా చేశాయా అని ప్రశ్నించారు. ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించాయా అని మండిపడ్డారు. మళ్లీ ఏ మొహాలు పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి చేయకపోగా వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకోవడం భాజపాకే చెల్లుతుందన్నారు.

మోటర్లకు మీటర్లు పెట్టడం ఆ ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని, అందుకే రాజీనామా చేశారని హరీశ్​ రావు గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థల చేతికి రైతుల బతుకులను అప్పగించే ప్రమాదకరమైన ఆలోచనకు కేంద్రం తెరతీసిందన్నారు.

ఇదీ చదవండి: దుబ్బాక అభ్యర్థి సుజాతను కలిసిన మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.