ETV Bharat / state

రైతు బంధు డబ్బులేవి..? అధికారులకు భాజపా నాయకుల వినతి

author img

By

Published : Jun 18, 2020, 4:24 PM IST

హుస్నాబాద్​లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసన చేపట్టారు. హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాల్లోని 5000 మంది రైతులకు యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు డబ్బులు అందలేదని ఆరోపించారు.

హుస్నాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నాయకుల నిరసన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసన చేపట్టారు. హుస్నాబాద్​ అక్కన్నపేట కోహెడ మండలాల్లోని 5000 మంది రైతులకు యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఇంతవరకు అందలేదని.. వాటిని వెంటనే అందించాలని హుస్నాబాద్ డివిజన్ వ్యవసాయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. మళ్లీ ఇప్పుడు వానాకాలానికి సంబంధించిన రైతుబంధు డబ్బులు వారం రోజుల్లో పడతాయని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు.

యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు డబ్బులు ఇంకా రాకపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమా..? ఎమ్మెల్యే నిర్లక్ష్యమా..? జిల్లా మంత్రి నిర్లక్ష్యమా..? అర్థం కావడం లేదన్నారు. కొత్తగా రైతు పట్టా, పాస్ బుక్కులు ఇచ్చిన వారికి కూడా రైతుబంధు వర్తింప చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు గొప్పలు చెప్పుకోవడం కాదని.. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుబంధు డబ్బులు ఇచ్చిన తర్వాతనే వానాకాలం పంటకు సంబంధించిన రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండీ : 'కరోనా సమయంలో విద్యుత్ బిల్లుల పెంపు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.