ETV Bharat / state

వ్యవసాయ బిల్లులతో దళారీ వ్యవస్థ నేలమట్టం: పెద్దిరెడ్డి

author img

By

Published : Oct 8, 2020, 4:22 PM IST

రైతుల స్వేచ్ఛ, అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని మాజీ మంత్రి, భాజపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఈ బిల్లులతో దళారీవ్యవస్థ నేలమట్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

bjp leader peddi reddy
భాజపా నేత పెద్దిరెడ్డి

రైతులకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ మంత్రి, భాజపా నేత పెద్దిరెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఏ రంగానికి ఎంత అవసరమో తెలుసుకోవడానికే మీటర్లు పెట్టడం తప్ప రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల పేరిట బిల్లు వసూల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులపై ఆంక్షలు విధిస్తూ వారిని అభివృద్ధి చెందకుండా అడ్డుపడిందని పెద్దిరెడ్డి విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం భాజపా సర్కార్ తీసుకొచ్చిన బిల్లులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగం కార్పొరేట్ల వశమౌతుందంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్​కు వ్యవసాయం గురించే తెలియదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.