ప్రక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలతో పోల్చితే దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని భాజపా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ప్రాంత ప్రజలు ఉపాధి కోసం దూరప్రాంతాలకు వలస వెళ్తున్నారని.. దీనికి పాలకులే కారణమని ఆరోపించారు. నియోజకవర్గ ఓటర్లు ఆలోచించాలని.. భాజపాకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల