తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బతుకమ్మ పండుగకు మహిళలందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ తెలిపారు. చిన్న కోడూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు చీరల పంపిణీ చేశారు. అన్ని మతాల వారిని సమ దృష్టితో చూసి సంక్షేమ పథకాలందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆమె అన్నారు.
పేదింటి ఆడపడుచులకు తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఈ చీరల పంపిణీ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో జిల్లాలో 3 లక్షల 49 వేల 179 మంది లబ్ధిదారులకు ఈ చీరల పంపిణీ చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్