సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా రాయపోల్ మండలంలో పార్టీల నాయకుల ప్రచారాలు హోరెత్తాయి. భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో యువకులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి.. రోడ్‌షో చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చరని.. కనీసం మాటలు చెప్పడానిరైనా దుబ్బాకలో ప్రచారానికి ముఖ్యమంత్రి రావట్లేదని బండి సంజయ్ విమర్శించారు. ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే.. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయవచ్చని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం విరోచిత పోరాటం చేసిన కుమురం భీంను స్మరించుకోలేని స్థితిలో తెరాస ప్రభుత్వం ఉందన్నారు. ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ఆరంభం దుబ్బాక ఉప ఎన్నిక నుంచే ప్రారంభమయిందన్నారు. దుబ్బాకలో గెలిచేది భాజపానే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదంవడి: బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు