BANDI SANJAY: గౌరవెల్లి భూ నిర్వాసితులపై సీఎం కేసీఆర్ కర్కశంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పేదలను రాచి రంపాన పెడుతున్నారని ఆరోపించారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి మెప్పించాలి కానీ.. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.
తెరాస, పోలీసులు కలిసి భూ నిర్వాసితులపై దాడి చేయడాన్ని భాజపా ఖండిస్తుందని సంజయ్ పేర్కొన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే భాజపా బృందం గౌరవెల్లి వెళ్లి.. బాధితులను పరామర్శిస్తుందని తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
గౌరవెల్లి భూ నిర్వాసితులపై దాడిని భాజపా ఖండిస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి.. మెప్పించాలి. రాత్రికి రాత్రి ఇళ్లను ఖాళీ చేయడం, విచక్షణా రహితంగా కొట్టడం వంటివి చేశారు. భాజపా బృందం గౌరవెల్లి వెళ్లి బాధితులను పరామర్శిస్తుంది. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తాం.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి..
హుస్నాబాద్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ప్రజాప్రతినిధులపై దాడి.. పోలీసుల లాఠీఛార్జ్