ఆశ్రమం నడుపుతున్న బాబా, తన అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ ఓ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్ శివారులో బాబా ఆశ్రమంలోని బాబా, అతని అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ధర్మాజీపేటకు చెందిన రఘు ఇంటర్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా బాబా అవతారమెత్తి రఘు అలియాస్ సమర్థ సాయిగా పిలువబడుతున్నాడు. చికోడ్ గ్రామ శివారులో గత కొన్నేళ్లుగా సాయి సమర్థ ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన అనుచరుడు నరేష్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు భక్తి మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ గౌడ్ నిందితులు నరేష్, రఘు బాబాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాబా అనుచరుడు నరేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, బాబా పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి