సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత తన స్వగృహంలో యోగాసనాలు వేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. యోగాసనాలు తప్పకుండా ప్రతి రోజు చెయ్యడం అలవర్చుకోవాలని అనిత అన్నారు.
యోగా అంటే చాలా మంది శరీరాన్ని మెలికలు తిప్పడం అనుకుంటారని.. కానీ యోగాసనాల్లో భాగమైన ప్రాణాయామం వల్ల అనేక లాభాలు ఉంటాయని అన్నారు. ప్రాణాయామాల్లో అనులోమ, విలోమ, బత్రిక, కపలవటిని అనే వ్యాయామాలు మానవుల శరీరం లోపల ఉన్న అవయవాల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయన్నారు. యోగా అనేది మానసిక వికాసాన్ని, ప్రశాంతతను, మన మీద మనకు ఒక నమ్మకన్ని పెంచుతుందన్నారు.
ఇదీ చూడండీ : కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ