ETV Bharat / state

భౌతిక దూరం మరిచిన మందుబాబులు

లాక్​డౌన్ వార్త వినగానే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. కొవిడ్​ నిబంధనలను మరచి మద్యం కోసం ఎగబడ్డారు.

liquor shops, Husnabad town
liquor shops, Husnabad town
author img

By

Published : May 11, 2021, 5:15 PM IST

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త లాక్​డౌన్ కారణంగా మందుబాబులు ముందు జాగ్రత్తగా మద్యం దుకాణాల ఎదుట మద్యం కోసం బారులు తీరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల వద్ద భౌతిక దూరం మరచి గుంపులు గుంపులుగా చేరారు.

గత సంవత్సరం లాక్​డౌన్ విధించినప్పుడు మద్యం దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డ మందుబాబులు.. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేశారు. ముందు జాగ్రత్తతో వారం, పది రోజులకు సరిపడా మద్యం సీసాలను కొనుక్కుని వెళుతున్నారు.

ఈ తొందరలో మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు పాటించడం లేదు. గుంపులుగుంపులుగా ఉంటూ.. మద్యం కొనడానికి ఎగబడుతున్నారు.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్ ఉత్పత్తి కోసం ఆ ప్లాంట్​ అప్పగించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.