ETV Bharat / state

మద్యం దుకాణానికి హారతిచ్చిన మందుబాబు - siddipet

రాష్ట్రంలో నేటి నుంచి వైన్​షాపులు తెరుస్తుండటం వల్ల మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని మద్యం దుకాణానికి ఓ మందు బాబు మంగళ హారతి ఇచ్చి.. కొబ్బరికాయ కొట్టాడు.

a man Gave the Harati to the wine shop at husnabad
మద్యం దుకాణానికి హారతిచ్చిన మందుబాబు
author img

By

Published : May 6, 2020, 12:51 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మద్యం ప్రియులు ఉదయం నుంచే దుకాణాల ముందు బారులుతీరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల.. దుకాణాల ముందు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాటు చేసిన సర్కిళ్లలో తమ చెప్పుల జతలను ఉంచుతున్నారు.

ఇన్ని రోజుల తర్వాత దుకాణం తెరుస్తుండటం వల్ల ఓ మద్యం ప్రియుడు ఆనందంతో దుకాణానికి మంగళ హారతి ఇచ్చి.. కొబ్బరికాయ కొట్టాడు. దుకాణాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి వైన్​షాపులు తెరుస్తుండటం పట్ల మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.