సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ సహకార సంఘాలకు నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడం వల్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. హుస్నాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చివరి రోజు అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
తెరాస అభ్యర్థుల తరపున జడ్పీ వైస్ ఛైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత పాల్గొన్నారు. 13 డైరెక్టర్ల స్థానాలకు మొత్తం హుస్నాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 86 నామినేషన్లు దాఖలయ్యాయి. కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. కట్కుర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 13 వార్డులకు 13 నామినేషన్లు దాఖలు కాగా డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఇదీ చూడండి : ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్