సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 12 మంది అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారి తెలియజేశారు. రెండు రోజుల పాటు విత్డ్రా చేసుకునేందుకు అవకాశముంటుందని... ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు.
మొత్తం నామినేషన్లు దాఖలు చేసినవారిలో నలుగురు జాతీయ పార్టీ, 10 మంది అభ్యర్థులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, 32 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయగా.. 12 మందిని స్క్రుటినీలో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి చెప్పారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం