సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ఉత్పత్తి కేంద్రంలో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా తక్కువ బరువుగల కె2 సిరీస్ ట్రాక్టర్లను తయారు చేస్తామని తెలిపారు. జహీరాబాద్ ట్రాక్టర్ల హబ్‌గా మారనుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ప్లాంట్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఇప్పటికే రూ.1,087 కోట్ల పెట్టుబడి పెట్టగా, 1,500 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఏడాదికి లక్ష ట్రాక్టర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని వెల్లడించింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల వాహనాలను 65 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.