ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. రైతులను రుణ విముక్తులను చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి విడతగా రూ.25వేలు రైతుల ఖాతాలో జమ అయినట్లు వెల్లడించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తు.చ. తప్పకుండా పాటించే ఏకైక ప్రభుత్వం తెరాస అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు ఎం.జి.రాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.