కరోనా బాధితుల సహాయార్థం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధాంతి సందర్భంగా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంపీపీ గిరిధర్‌రెడ్డి ప్రారంభించారు.
జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లికి చెందిన ప్రవాస భారతీయుడు డా.ఉజ్వల్‌రెడ్డి, ఎంపీపీ గిరిధర్‌రెడ్డి సౌజన్యంతో ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. కరోనా బాధితులు 99662 50091, 99490 36183 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం