ETV Bharat / technology

పినాక మిస్సైల్ కోసం క్యూ కడుతున్న దేశాలు.. దీని స్పీడు చూస్తే శత్రువులకు హడల్..! - PINAKA WEAPON SYSTEM

పినాక వెపన్ సిస్టమ్​పై ప్రపంచం దృష్టి- ఎగుమతులు ప్రారంభించిన భారత్!

Pinaka Weapon System
Pinaka Weapon System (DRDO)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 25, 2024, 2:14 PM IST

India Started Supplying Pinaka Weapon System: పవర్​ఫుల్ పినాక వెపన్ సిస్టమ్​ డెవలప్మెంట్​తో ప్రపంచం దృష్టి ఇండియాపై పడింది. చాలా దేశాలు స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) పట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో భారత్.. ఆర్మేనియాకు పినాక రాకెట్లను సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ మేరకు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్‌లోని తొలి బ్యాచ్‌ను ఆర్మేనియాకు పంపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఆయుధ వ్యవస్థల సరఫరా కోసం ఒప్పందాలు: రక్షణ పరికరాలను కొనుగోలు చేసే భారత్ ప్రధాన కనుగోలుదారుల్లో ఆర్మేనియా ఒకటి. యుఎస్, ఫ్రాన్స్​తో పాటు ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్​ను కొనుగోలు చేసే వాటిలో మూడో అతి పెద్ద దేశం ఇది. సుదీర్ఘ చర్చల తర్వాత రెండేళ్ల క్రితమే ఈ వెపన్ సిస్టమ్ సరఫరా కోసం భారతీయ కంపెనీలు, ఆర్మేనియా ఒప్పందంపై సంతకాలు చేశాయి.

పినాకా రాకెట్ టెస్ట్: అత్యంత శక్తివంతమైన స్వదేశీ పినాక రాకెట్‌పై ఆగ్నేయాసియా, యూరప్‌లోని అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ సిస్టమ్​లో అనేక కొత్త వేరియంట్స్​ను డెవలప్ చేయడంతో ఇండియన్ ఆర్మీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేర్చడానికి యోచిస్తోంది. ఈ నేపథ్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కూడా ఇటీవలే పినాకా గైడెడ్ రాకెట్‌ను పరీక్షించింది. ఈ రాకెట్‌ను నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్, ప్రభుత్వ యాజమాన్యంలోని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ డెవలప్ చేశాయి.

భారత్ తన స్వదేశీ రక్షణ వ్యవస్థల ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ పినాక రాకెట్ సిస్టమ్​ను డెవలప్ చేశారు. ఈ స్వదేశీ పినాక రాకెట్ లాంచర్ అత్యంత సామర్థ్యం గల ఆయుధ వ్యవస్థ. ఇందులో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న వేరియంట్స్ ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవం శివుడి విల్లు 'పినాకం' పేరుమీదుగా ఈ ఆయుధ వ్యవస్థకు ఆ పేరు పెట్టారు.

ఈ శక్తివంతమైన రాకెట్ సిస్టమ్​ 25 మీటర్ల నుంచి 75 కి.మీ దూరం వరకు టార్గెట్​ను గురిపెట్టగలదు. దీని వేగం సెకనుకు 1000-1200 మీటర్లు. అంటే ఒక్క సెకనులో ఇది ఒక కిలోమీటరు దాటుతుంది. దీన్ని ఒకసారి ప్రయోగించాక ఆపడం అసాధ్యం. ఈ పవర్​ఫుల్ వెపన్ సిస్టమ్​ను ఫ్రాన్స్ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అమెరికా తర్వాత భారత రక్షణ పరికరాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఫ్రాన్స్.

ఇండియాకు చెందిన శాటిలైట్​ని ప్రయోగించిన స్పేస్​ఎక్స్​- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే!

ఇండియా మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్ లాంచ్- ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.