సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో బిహార్‌కు చెందిన సోనీకుమారి అనే యువతి అదృశ్యమైంది. ఈనెల 16వ తేదీన నానమ్మ ఇంటి నుంచి తల్లి వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన ఆ యువతి మధ్యలోనే మాయమైంది.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కంగారుపడి చుట్టుపక్కల, తెలిసినా వారి ఇళ్ల వద్ద వెతికినా లాభం లేకుండా పోయింది. ఆచూకీ లభించకపోవడం వల్ల బాధిత కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం