Mythri The Humanoid Robot : మైత్రి ది హ్యూమనాయిడ్ రోబో - మైత్రి ది రోబో
Mythri The Humanoid Robot : చిట్టి ది రోబోట్". ఈ డైలాగ్ గుర్తుందిగా..! ఎందుకు గుర్తుండదు రోబో సినిమాలో చిట్టి చేసిన యాక్షన్ అంతా ఇంతా కాదు కదా..! ఆ సినిమా తరువాత చాలా మంది... తాము కూడా అచ్చం అలాగే.. మన ఇంట్లో మనిషిలాగా రోబోను చూసుకోవాలని మనలో చాలా మందికి ఉంది కదా..! ఐతే.. ఏం ఫర్లేదు.. మన కలను నేరవేర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అచ్చం మనిషిలాగా సేవలందించే హ్యూమనాయిడ్ రోబోలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేందుకు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఫణికుమార్ కూడా ఇదే తరహాలో ఓ రోబో తయారు చేశాడు. మరి ఆ రోబో ప్రత్యేకతలేంటో చూద్దామా...
Mythri The Humanoid Robot