హరిత ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలమవుతున్నారని సుప్రీం సీనియర్ న్యాయవాది నిరూప్రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. గ్రామస్థులు, చిన్నారులతో కలిసి కాలుష్య నివారణ ర్యాలీ నిర్వహించారు. సేవ్ నేచర్... సేవ్ ప్యూచర్ అంటూ నినాదాలు చేశారు. పాశమైలారంలో పరిశ్రమలను ముసివేయాలని... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏడు అంశాలతో హరిత ధర్మాసనం ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని న్యాయవాది నిరూప్రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: నీట్ ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు