ETV Bharat / state

గుడ్డు కావాలీ... మధ్యాహ్న భోజనంలో "గుడ్డు గుటుక్కు"!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు సర్కారు గుడ్లను అందిస్తోంది. ఇదే అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. మంత్రుల పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వం, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం... పేద విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులు సరైన పోషకాహారం పొందడం లేదు.

మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఎక్కడ...?
author img

By

Published : Nov 2, 2019, 6:22 AM IST

మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఎక్కడ...?

విద్యకు ఆకలి ఆటంకం కాకూడదన్న లక్ష్యంతో.. గవర్నమెంట్​ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం సర్కార్​అమలు చేస్తోంది. దీని ద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి భోజనంలో ప్రతి విద్యార్థికి నెలకు 12గుడ్లను అందిస్తోంది. ఇందుకోసం భోజన ఖర్చులకు అదనంగా ఒక్కో గుడ్డుకు నాలుగు రూపాయల చొప్పున నిర్వాహకులకు ప్రభుత్వం అందిస్తోంది. అయితే... అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా అవుతున్నా పాఠశాల విద్యార్థులకు గుడ్డు అందడం లేదు.

పౌష్టికాహారం అంతంతమాత్రమే...

ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్షయ పాత్ర 530పాఠశాలలో చదువుతున్న 64వేల 399 మంది విద్యార్థులకు భోజనం సరఫరా చేస్తోంది. భోజనానికి, గుడ్లకు వేర్వేరుగా బిల్లులు చెల్లిస్తున్నారు. నిధులకు ఇబ్బంది లేకున్నా పౌష్టికాహారం అందించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

మా పిల్లలకు గుడ్డు కావాలి..!

ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నారులకు గుడ్డు అందిస్తున్నారు. వీరికి సరఫరా చేస్తున్న వారి సహాయంతో అక్షయపాత్ర భోజనం అందిస్తున్న బడుల్లో విద్యార్థులకు గుడ్డు అందేలా చేయవచ్చు. ఉపాధ్యాయులు సైతం తమ విద్యార్థులకు గుడ్డు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వారి భోజనంలో గుడ్డు ఉండదు

అక్షయ పాత్ర ఫౌండేషన్ నియమం ప్రకారం... వారి భోజనంలో గుడ్డు ఉండదు. దానికి బదులు విద్యార్థులకు పండ్లను ఇచ్చేవారు. గుడ్డు ఇవ్వని కారణంగా ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. నిధులు అందని కారణంగా పండ్లు కూడా నిలిచిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుడ్డుకు ప్రత్యామ్నాయం లేదు

ఆహారంలో గుడ్డుకు ప్రత్యామ్నాయం మరేది లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒకగుడ్డు తినాలని వారు సూచిస్తున్నారు. కనీసం వారానికి 3-4 తినడం ద్వారా అనేక పోషకాహాలు శరీరానికి అందుతాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.