ETV Bharat / state

వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్న తహశీల్దార్లు! - సంగారెడ్డి జిల్లా వార్తలుు

ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహశీల్దార్లు వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్​ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో గల వీఆర్వోలు తహశీల్దార్లకు రికార్డులు అప్పగించారు.

vros Surrender All Records To Thahishildars In Sangareddy District
వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్న తహశీల్దార్లు!
author img

By

Published : Sep 8, 2020, 10:56 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వీఆర్వోల నుంచి తహశీల్దార్లు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రెవిన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీఆర్వోల నుంచి దస్త్రాలన్నీ స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్​ ఆదేశించడం వల్ల సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్​, కంగ్టి, కల్హేర్​, మనురు, నాగలిగిద్ద, సిర్గాపూర్ మండలాల పరిధిలోని వీఆర్వోల నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో తహశీల్దార్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోలు రికార్డులు అప్పగించిన విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించినట్టు తహశీల్దార్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.