ETV Bharat / state

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం' - vote awareness programm in sangareddy

దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న యువతకు... సరైన నాయకుడి ఎంపిక ఎంత అవసరమో ఈనాడు-ఈటీవీ భారత్ వివరిస్తోంది. సమర్థులను ఎన్నుకొని... ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ సదస్సులు నిర్వహించి చైతన్యపరుస్తోంది.

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'
'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'
author img

By

Published : Jan 11, 2020, 7:09 PM IST

సంగారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు 'ప్రజాస్వామ్య బలోపేతం- యువత పాత్ర' అనే అంశంపై 'ఈటీవీ భారత్- ఈనాడు' అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని... అభిప్రాయం వెల్లడించారు. ప్రలోభాలకు లొంగకుండా... సరైన నాయకుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు నీతి నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ఉండాలని విద్యార్థులు అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణీ చేసే వారికి.. ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఒకసారి ఇచ్చే డబ్బులకు ఐదు సంవత్సరాల కాలాన్ని అమ్ముకోవద్దని కోరారు. డబ్బులు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు.

కళాశాలలో సదస్సు నిర్వహించినందుకు... ప్రిన్సిపల్ అచ్యుతం 'ఈటీవీ భారత్- ఈనాడు'కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం బలోపేతం యువతతోనే సాధ్యమన్నారు. యువత ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు.

దేశాభివృద్ధి, రక్షణ కోసం యువత ప్రలోభాలకు గురికావద్దని, సమర్థ నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఓటరు చైతన్యంపై మరిన్ని సదస్సులు నిర్వహించి... విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

'ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం'

ఇదీ చూడండి: 'ఆమెను అత్యాచారం చేసి అంతమొందించాడు'

Intro:TG_SRD_56_10_ATTN_MUNCI_POLLS_AWARENESS_PKG_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి

NOTE: ఈ వార్తలో రెండు వాయిస్ ఓవర్ లు ఇచ్చాను. పరిశీలించగలరు.

( ) "భారతదేశం.. ప్రజాస్వామ్య దేశం". దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న యువకులు.. సరైన నాయకుడికి ఎంపికలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సమర్థ నాయకుని ఎంపిక చేయాలని.. ప్రజాస్వామ్య విలువలను కాపాడలంటూ యువతకు "ఈటీవీ భారత్- ఈనాడు" పలు సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని.. ఇటువంటివి మరిన్ని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ అచ్యుతం కోరారు..... LOOK

VO1: సంగారెడ్డి లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు "ఈటీవీ భారత్- ఈనాడు" ప్రజాస్వామ్య బలోపేతం- యువత పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని.. రాజకీయ నాయకునికి కావాల్సిన లక్షణాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చే, నోటు, మద్యానికి అలవాటు పడొద్దని, సరైన నాయకుణ్ణి ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేశారు.....SPOT

Body:VO2: ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు నీతి నిజాయితీ, ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధికి కృషి చేసే వారై ఉండాలని విద్యార్థి విజయ్ తెలిపారు. ఎన్నికల సమయంలో వచ్చి డబ్బులు, మద్యం పంపిణీ చేసే వారిని .. ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఒకసారి ఇచ్చే డబ్బుల కోసం ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేయొద్దని.. డబ్బులు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని స్పష్టం చేశారు......BYTE
బైట్: విజయ్, విద్యార్థి

VO3: "ఈటీవీ భారత్- ఈనాడు" వారు.. తమ కళాశాలలో మంచి సదస్సు నిర్వహించినందుకు ప్రిన్సిపాల్ అచ్యుతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం బలోపేతం యువతతోనే సాధ్యమని.. దేశ పరిరక్షణ కొరకు యువత ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. ఓటరు చైతన్యం పై ఎలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించి.. విద్యార్థులకు మంచి దారి చూపాలన్నారు.....BYTE
బైట్: అచ్యుతం, ప్రిన్సిపాల్, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల

Conclusion:EVO: దేశం అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకుడు అవసరం... దాని ఎంపికను సరైన పద్దతిలో ఎంచుకోవాల్సిన బాధ్యత మాత్రం యువతపై ఉంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.