మాస్కులు ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు మొబైల్ దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. జరిమానాతో పాటు కేసులు నమోదు చేశారు.
పురపాలికలోని వ్యాపార సముదాయాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. మొబైల్ దుకాణ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా మాస్కులు పెట్టుకోమంటూ పురపాలక అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానాతో పాటు దుకాణాన్ని సీజ్ చేసినట్లు పురపాలక శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ తెలిపారు.