సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడకు చెందిన గొల్ల అనంతి బుధవారం రాత్రి.. రోజు మాదిరిగానే ఇంటి ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు నిలిపాడు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు పెట్టడం వల్ల మంటలు చెలరేగి రెండు బైకులు కాలిపోయాయి.
తనపై గిట్టనివారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఝరాసంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా